Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన కొంచెం శంకర్ ఇటీవలే మూసీ వాగులో కాలుజారి మృతి చెందాడు. 1999 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు, స్నేహితులు విరాళాలు సేకరించి సోమవారం మృతుని కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో రామయ్య నాగయ్య, శ్రీను, చౌగాని రామయ్య, కారంగుల గోపి, సోమయ్య ప్రసాద్, వాసు, బాలకృష్ణ, భాష, ఆంజనేయులు, వెంకన్న, నాగరాజు, నాగయ్య, సుజాత, సంధ్య, సుధా తదితరులు పాల్గొన్నారు.