Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
అమరుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని పాములపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పోషబోయిన సాయిలు (76) మృతి చెందారు. ఈ మేరకు జూలకంటి సోమవారం సాయిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశం, పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, పాధురి శశిధర్‌రెడ్డి, మల్లు గౌతమ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, విష్ణు, నాగయ్య, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాగమ్మ, ఇందిరమ్మ, శ్రీను,సైదులు తదితరులు పాల్గొన్నారు.