Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఉద్యోగ, ఉపాధి అవకా శాలు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నా యని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక సీపీఐ ప్రజా భవన్లో నిర్వహించిన ఏఐవైఎఫ్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీ, విమానయానం, బొగ్గు, బీఎస్ఎన్ఎల్ వంటి వాటిని ప్రయివేటీకరిస్తూ పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిసెంబర్లో దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, ఏవైఎఫ్ జిల్లా కోశాధికారి ఎనమల్ల నవీన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, ఏఐవైఎఫ్ నాయకులు టోటకురి చలమంద రాయుడు, పల్లె మధు, ఏశమోని మల్లేష్, తోటపల్లి నగేష్, జూలూరి మహేష్, కొండల్, అలంపల్లి శ్రావణ్, ఉడుత జంగయ్య, చక్రి తదితరులు పాల్గొన్నారు.