Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని రైతులు వచ్చే యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో యాసంగీ ఆరుతడి పంట సాగు విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే యాసంగి పంటకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రైతులు వరికి బదులుగా 11 రకాలైన ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. మార్కెట్లో ఇతర పంటలకు కూడా మంచి ధర ఉందనే విషయం రైతులకు వివరించాలన్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చే సీడ్స్ జిల్లాలో సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని డీలర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఏవో రామారావునాయక్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్‌గౌడ్, ఏడీఏలు సంధ్యారాణి, జగ్గినాయక్, వాసు, శాస్త్రవేత్తలు భారత్, నరేష్, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.