Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరు తెగి సెల్లార్లో పడ్డ లిఫ్ట్
నలుగురికి గాయాలు
నవతెలంగాణ -మిర్యాలగూడ
ప్రమాదవశాత్తు వైరు తెగి లిఫ్ట్ మూడో అంతస్తు నుంచి సెల్లార్లోకి పడి నలుగురికి గాయాలైన సంఘటన సోమవారం మిర్యాలగూడలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం..పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన మౌలాలి, మొహమ్మద్ గులాం హుస్సేన్, పర్వీన్, రజియా సుల్తానా, రిజ్వానాలు తమ కుటుంబ సభ్యుడైన మహబూబ్ పాషాను స్కానింగ్ చేయించేందుకు స్థానిక చక్రవర్తి స్కాన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. మూడో అంతస్తులో ఉన్న స్కానింగ్ గదికి వెళ్లి తిరిగి లిఫ్టులో కిందికి వస్తున్నారు. ఈ క్రమంలో లిఫ్టు వైరు తెగిపడి లిఫ్టు మూడో అంతస్తు నుంచి సెల్లార్లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో లిఫ్టులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిబ్బంది దిగొచ్చి గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.