Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రేడర్లు ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
బోర్లు, బావులు కింద సాగైన పంటలు చేతికొచ్చాయని, ఇప్పటికే 50 శాతం పంటలను రైతులు కోసారని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వానాకాలం పంటను కోసి కల్లాల వద్ద ధాన్యపు రాశులు పోసుకుని కొనుగోళ్లకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదన్నారు. అకాల వర్షాలు వస్తే రైతులు ఆరుగాలం పండించిన పంట పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 18 నుంచి ఐకేపీ కేంద్రాలు ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారని, కానీ నేటి వరకూ చేయలేదన్నారు. కొన్ని చోట్ల పొలాల వద్ద ఉన్న ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు నూకల జగదీష్‌చంద్ర, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, గుణగంటి రాంచంద్రు, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.