Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలంలోని కీతవారి గూడెం గ్రామంలో నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం మిర్యాల గూడ - కోదాడ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకు లు మాట్లాడుతూ నీటి కోసం నెలరోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పైపులైన్లు పగిలిన వెంటనే వాటికి మరమ్మతులు చేసే విషయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఐదు వేల జనాభా ఉన్న గ్రామానికి ఒక వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పంపిస్తే నీటి సమస్య ఎలా తీరుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షేక్ మున్నీసా బేగం, చాంద్‌మియా, సీపీఐ(ఎం) నాయకులు తుమ్మల సైదయ్య, సీపీఐ నాయకులు బాధ నర్సయ్య, మాజీ ఎంపీటీసీ జుట్టుకొండ వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి శ్రీను, కీత సోమయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు, పాలవెల్లి జంగయ్య, చిత్తలూరి వెంకటేశ్వర్లు, నాగుల్ మీరా, వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.