Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్యర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
నిలువ నీడ లేని నిరుపేదలకు చివ్వేంల మండలం కుడకుడ శివారులోని సర్వే నెంబర్ 126లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ పేదలకు సర్వే నెంబర్ 126లో ఉన్న భూమిలో పట్టాలివ్వాలని, సెప్టెంబర్ 5న గుడిసెలు వేసేందుకు యత్నించగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారన్నారు. అక్కడే కొంత మంది అధికార పార్టీ నాయకులు భూమిని ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు దొంతమల్ల రామన్న, కార్యదర్శి అరుట్ల శంకర్రెడ్డి, పీవోడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బుక్యా రామోజీ, పీవైఎల్ జిల్లా నాయకులు మీరా, రాములు, పీడీఎస్యూ జిల్లా నాయకులు సింహాద్రి, రాజేష్, రేణుక, శారద, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు.