Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ - తుంగతుర్తి
సీపీఐ(ఎం) మండల మహా సభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకలపల్లి రాములు కోరారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్రెడ్డి, మండల కార్యదర్శులు కడెం లింగయ్య, భాస్కర్కుమార్, వజ్జా శ్రీనివాసు, గడ్డం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.