Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ న్యాయమూర్తి కలిదిండి తులసి దుర్గారాణి
నవతెలంగాణ -రామన్నపేట
స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో భారత ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశంలో దేశ ప్రజల ప్రయోజనం కోసం సొంతంగా ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని, ఆ చట్టాల ఫలాలు ప్రతి పౌరుడికి అందాలని స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కలిదిండి తులసి దుర్గా రాణి తెలిపారు. సోమవారం మండలంలోని సిరిపురం గ్రామంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవల అవగాహనపైఅవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ ఆంజనేయులు భూతగాదాలు, గేట్లు, సరిహద్దుల పై అవగాహన కల్పించారు. ఏజీపీ ఉయ్యాల హనుమంతు గౌడ్ రొయ్య వద్ధుల సంరక్షణ చట్టం పై, న్యాయవాది శ్రీనివాస్ గౌడ్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ పై, న్యాయవాది మజీద్ భూ సమస్యలు, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ల పైన, న్యాయవాది డె విడ్ వాహనాల చట్టం, లైసెన్స్, బీమా చట్టాలపై, న్యాయవాది జినుకల ప్రభాకర్ మైనర్ వివాహాలు, వాహనాలు నడుపుట వల్ల వచ్చే అనర్థాలపై, స్థానిక ఎస్సై వెంకటయ్య వద్ధులు, వారి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి తులసి దుర్గా రాణి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వి రమణ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సులు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు కొనసాగుతాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ నర్సు, ఎంపీటీసీ బడుగు రమేష్, ఉపసర్పంచ్ దాసి రెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, న్యాయవాదులు ఉయ్యాల హనుమంతు గౌడ్, మామిడి వెంకటరెడ్డి, సుక్క శ్రవణ్ కుమార్, అప్పం రామేశ్వరం, గోశిక చక్రపాణి, రాపోలు నరసింహ, కూనూరు ముత్తయ్య, కోర్టు కానిస్టేబుల్ రామాచారి, సైదులు, న్యాయసేవ సభ్యులు కె. సంపత్, సత్యేంద్ర పాల్గొన్నారు.