Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
మండలంలో నెలకొన్న అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్‌చేశారు. మండలంలోని సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్‌చేస్తూ ఆ పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అభివద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయన్నారు. విద్య, వైద్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. అర్హులైన వారికి ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరుచేయాలన్నారు. ధరణిలో సమస్యలు, సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య, బూర్గు కష్ణారెడ్డి, ఎమ్‌డి.పాషా, మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు చీరిక సంజీవరెడ్డి, అలివేలు, గడ్డం వెంకటేశ్, రాగీరు కష్ణయ్య, బోదాసు వెంకటేశం, కొండె శ్రీశైలం, బొజ్జ బాలయ్య, పొట్ట శ్రీను, ఆదిమూలం నందీశ్వర్, నర్సిరెడ్డి, ఎల్కరాజు యాదగిరి, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర ఊషయ్య, ఎస్కె.మదార్, అంతటి అశోక్, శేఖర్, గోశిక కరుణాకర్, గోవర్థన్, నాగరాజురెడ్డి, ఎమ్‌డి.ఖయ్యుమ్, బత్తుల దాసు, చింతల సుదర్శన్, అంజిరెడ్డి, శ్రీకాంత్, సుజాత పాల్గొన్నారు.