Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : సీఎం కేసీఆర్ దత్తత గ్రామామైన వాసాలమర్రిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటగా ప్రారంభించనున్న దళిత బంధు పథకంలో భాగంగా బుధవారం లబ్దిదారులకు వాహనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరుకానున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, దళితబంధు నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.