Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
బహుజన సేన ఆధ్వర్యంలో ఈ నెల 30న నల్లగొండ జిల్లా కేంద్రంలో బహుజన ఉద్యమం పీడిత కులాల విముక్తి అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్టు బహుజన సేన రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆడెపు త్యాగరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలో సదస్సు కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కన్వీనర్ వెంకట్, ప్రతినిధులు రాచకొండ కష్ణయ్య, ఆలకుంట యాదయ్య, రాచకొండ వెంకన్న, ఆలకుంట సైదులు, అంజయ్య, సిహెచ్ సతీష్, కదిరి వీరేందర్ పాల్గొన్నారు.