Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రగతిశీల యువజనుడుగా,పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన పోరాటంలో క్రియాశీలక పాత్రను పోషించిన అమరవీరుడు దూడల వెంకన్న ఎంచుకున్న పోరుబాటలో నడుద్దామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్దన్,డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో దూడల వెంకన్న 32 వ వర్థంతి సందర్భంగా చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సుంచు యాకుబ్, జిల్లానాయకులు డొంకెన శ్రీహరి, చిర బోయిన రాజయ్య, బర్మబాబు, ఇక్కిరికుమార్, ఆర్.సీత, తమ్మడిమాదవి, కొమ్మిడిగోపాల్ రెడ్డి, కొంగరి సాయిరాం, వరిమడ్ల శ్రీను,గడ్డం యాదగిరి, టి.అంజయ్య, పి.సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.