Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
మండల పరిధిలోని చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన బాత్క ఐలయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. మంగళ వారం ఆయన మతదేహాన్ని నకిరేకల్ మాజీ శాసన సభ్యులు వేముల వీరేశం సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థ్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా ఇటీవల మరణించిన ఉస్కుల పుల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏనుగులదోరి గ్రామానికి చెందిన ఇసరం మల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు . ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు , తొండ్లయి సర్పంచి బింగి కొండయ్య , చిన్నతుమ్మలగూడెం సర్పంచి దాసరి రాజు, నాయకులు వేముల నర్సింహ, రేగట్టె రాజశేఖరరెడ్డి, కొరివి శివరాం, శేఖర్, ఉయ్యల శ్రవణ్, బోడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.