Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
పేదల అసైన్డ్ భూములను కొల్లగొట్టి పెద్దలకు కట్టబెట్టే వెలిమినేడు ఇండిస్టియల్ పార్కు అసైన్డ్ భూముల సేకరణను తక్షణం నిలిపివేయాలని పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు. మంగళ వారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో 418 సర్వే నెంబర్ చుట్టూరా 500 ఎకరాల భూముల్లో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ఏడాది కాలం పోరాడి దామరచర్ల యాదాద్రి విద్యుత్శ్చక్తి ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములల్లోకి పంపించామన్నారు. మరోసారి 199 ఎకరాల అసైన్డ్ భూములను 116 మంది కుటుంబాల నుండి తీసుకుని ఇండిస్టియల్ పార్క్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని , పార్కుకు ఇచ్చేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పిశాటి మాధవరెడ్డి,అంశాల సత్యనారాయణ, ఉయ్యాల లింగస్వామిగౌడ్, సామ రామిరెడ్డి,నాగిళ్ళ యాదయ్య, ,కొరగాని రామచంద్రం,మెట్టు సత్తయ్య, ఎల్కరాజు సైదులు, శేపూరి రామచంద్రంతో పాటు అసైన్డ్ భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు.