Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ - భువనగిరి
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద డ్యూటీ కేటాయించబడ్డ ఆశాలందరికీి అదనపు వేతనం ఇవ్వాలని ఆశా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆశాలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షకేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కోసం ఆశాలకు ఈ నెల 25 నుండి నవంబర్1వ తేదీవరకు డ్యూటీలు కేటాయించరాని తెలిపారు. వివిధ గ్రామాలనుండి వస్తున్న ఆశాలకు ప్రయాణ చార్జీలను, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎఎన్ఎం ల నియామకలలో ఆశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షురాలు రంగ సంతోష, జిల్లా కోశాధికారి పుష్ప, నాయకురాళ్లు అలివేలు, బాలమణి, ధనలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.