Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప సర్పంచ్, ఎంపీడీఓకు జాయింట్ చెక్ పవర్ ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ గ్రామ ఉపసర్పంచ్ సిర పంగి స్వామి వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి విచారించి 16 లక్షల 85 వేల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్టు తేల్చారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని సర్పంచ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే .సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి ఇచ్చిన సంజాయిషీ సంతప్తికరంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఈ నెల 25న నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతికి ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ఎంపీడీవో ,ఉప సర్పంచ్ ల కు జాయింట్ చెక్ పవర్ ఇస్తూ నల్లగొండ జిల్లా కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు గ్రామపంచాయతీ అభివద్ధికి నిధుల వినియోగానికి ఉప సర్పంచ్ ,ఎంపీడీఓ సంతకాలతో. నిధులు డ్రా చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.