Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ సీఈఓ మదన్ మోహన్
నవతెలంగాణ - తిప్పర్తి
వ్యవసాయ అనుబంధ రంగాల లోన్లను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ సీఈవో మదన్ మోహన్ అన్నారు. నల్గొండ జిల్లా సహకార సంఘం బ్యాంకు ఆధ్వర్యంలో ఇస్తున్న వ్యవసాయ , ఉన్నత చదువుల కోసం ఈస్తున్న లోన్లపై మంగళవారం మండలకేంద్రంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్ర పరికరాలు ,పౌల్ట్రీ రంగంలో కోళ్ళ ఫామ్ షెడ్లోను , గోర్ల లోను ,పాడి పశువుల లోను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే వాళ్లకు భూముల తనఖా పెట్టుకుని ఇస్తున్న లోను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జిల్లాలో నూట ఇరవై ఐదు కోట్ల రుణాలను ఈ సంవత్సరానికి గాను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోని ఇప్పటికే 80 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ రెడ్డి , బ్రాంచ్ మేనేజర్ అశోక్ ,అసిస్టెంట్ మేనేజర్ మహిపాల్ రెడ్డి ,ఎన్.శేఖర్ రెడ్డి, తిప్పర్తి సంఘం సీఈవో పి.బిక్షమయ్య, ఎంపీపీ విజయలక్ష్మి లింగారావు, స్థానిక సర్పంచ్ రమేష్, డైరెక్టర్లు యాదగిరి రెడ్డి ,కొండ జానయ్య వనపర్తి జ్యోతి, గాది కష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.