Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిమ్మ మార్కెట్ యార్డు సమీపంలోని తిప్పర్తి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యానాల కష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించి పోవడం వల్ల స్థానిక తహసిల్దార్ ప్రసాద్, నకరేకల్ సీఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు మరి వెంకటయ్య, బి ప్రకాశరావు, ఏర్పుల రాజేశ్వర్, వంటే పాక వెంకటేశ్వర్లు ,బొడ్డుపల్లి లక్ష్మీ నర్సు, లక్ష్మణరావు, ఎస్. బిక్షం రెడ్డి పాల్గొన్నారు.