Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - ఆలేరుటౌన్
నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు మున్సిపాలిటీ అభివద్ధికి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రథమ మహాసభ ఎలుగల బాలయ్యనగర్ ఏసీరెడ్డి భవనంలో వడ్డెమానుశ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ జహంగీర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజా సమస్యలు అనేకం పేరుకుపోయాయన్నారు . ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్మెల్యే గొంగిడి సునీత సమస్యల పరిష్కారానికి ఎలాంటి కషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే అండర్‌పాస్ పనులు ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కావడం లేదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి అండర్‌పాస్ పనులు పూర్తి చేయాలన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మించి ఆలేరు ప్రాంతానికి తాగు ,సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. ఆలేరు ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తో మాట్లాడి ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయడం కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ఒత్తిడి తీసుకురావలని కోరారు .డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు ఇఆవ్వలని డిమాండ్ చేశారు. సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో ప్రజా పోరాటాలు నిర్వహించేందుకోసం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, మున్సిపాలిటీలలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద ఆ పార్టీ పట్టణ సీనియర్ నాయకులు గణగాని మల్లేష్ జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నరసింహులు, ,మండల, పట్టణ కార్యదర్శులు మొరిగాడి రమేష్,ఎంఏ ఇక్బాల్ , తాళ్లపల్లి గణేష్ ,మోరిగాడి మహేష్ ,మొరిగాడి అజరు, మోరిగాడి అశోక్, మోరిగాడి అంజనేయులు, ఎల్ గల శివ ,కాసుల నరేష్ ,భోగం రమేష్ ,మొగిలి పాక కష్ణ, వడ్డేమాన్ బాలరాజు ,వడ్డెమాను విప్లవ్, గణగాని రాజు, కటకం సుదర్శన్ ,కటకం హనుమంతు ,ఎండి.అమీర్, తదితరులు పాల్గొన్నారు.