Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -కేతెపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆ పార్టీ 7వ మండల మహాసభ నాయకులు ఏళ్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచేసి ప్రజలపై పన్నుల భారం మోపుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్, ఉద్యోగ నియామకాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తూ సీపీఐ(ఎం) ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. కరోనా కాలంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా నిత్యా వసర సరుకులు, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మండల కార్యదర్శిగా చింతపల్లి లూర్థు మారయ్య
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా చింతపల్లి లూర్థు మారయ్యను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల ,జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, జిట్ట నగేష్, సీనియర్ నాయకులు బోళ నరసింహారెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు కోట లింగయ్య, నకిరేకల్ మండల కార్యదర్శి రాచకొండ వెంకన్న ,ఆది మల్ల సుధీర్ , చెవగొని నాగయ్య ,గుండగాని భాగ్యమ్మ ,చెరుకు సత్తయ్య, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.