Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
పత్తి కార్మికలకు ఉత్పత్తిదారులు అయినా రైతులకు, సామాజిక భద్రత గౌరవప్రదమైన వత్తి కల్పించడానికి ఐఎల్ఓ కషి చేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రేన్సి హోటల్లో జరిగిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఐఎల్ఓ జిల్లా స్థాయి పత్తి కార్మికుల కోఆర్డినేషన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐఎల్ఓ పాటు పడుతుందన్నారు. స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం లేకుండా, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం కోసం అందరం సమిష్టిగా కషి చేద్దామని పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీయూసీ జాతీయ నాయకులు ఉజ్జినీ రత్నాకర్ రావు మాట్లాడుతూ వలస కార్మికుల రక్షణ చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నలప రాజు సతీష్, జిల్లా అధ్యక్షులు రామలింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మైన్ ద్దీన్ ,వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి బి నరసింహ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.