Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మేళ్లచెర్వు
గ్రామాల్లో సీపీఐఎం బలోపేతానికి కార్యకర్తలు కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలో ఆ పార్టీ మండల ఆరో మహాసభ మండల కార్యదర్శి వట్టెపు సైదులు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కషి చేయాలన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ శాఖలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో సీపీఐ(ఎం) జెండాలు ఎగురవేసే విధంగా చూడాల న్నారు.గ్రామాల్లో ఉండే సమస్యలపై గ్రామ శాఖలు పోరాటం చేయడం వల్ల పార్టీ బలోపేత మౌతుందన్నారు.నీళ్లు, నిధులు, నియామకాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నేటి వరకూ ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదన్నారు. కాళేశ్వరం పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.పెరిగిన ధరలతో సామాన్యుడి జీవనం కష్టతరంగా మారిందన్నారు.ఈ సమా వేశంలో జిల్లా నాయకులు రవినాయక్, అనంత ప్రకాశ్, పాండునాయక్, పులిచింతల వెంకట్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.