Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ-నల్లగొండ
అమరవీరుల త్యాగం అజరామరమని, ఫ్లాగ్ డే సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని డీఐజీ ఏవీ.రంగనాథ్ అన్నారు.ఫ్లాగ్‌డే వారోత్సవాలలో భాగంగా మంగళవారం 12వ బెటాలియన్ పోలీసులతో కలిసి జిల్లా పోలీసుశాఖ నిర్వహించిన సైకిల్‌ర్యాలీని ఆయన ప్రారంభించి సైకిల్ తొక్కుతూ అందరిని ఉత్సాహపరిచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకుసాగుతున్న పోలీసుల కషి అభినందనీయమని చెప్పారు.దేశవ్యాప్తంగా ప్రజాక్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి ఏడాది పోలీస్ ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరులత్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకమవుతూ మన్ననలు పొందాలని సూచించారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచిపేరు ఉన్నదని, దానిని మరింత ఇనుమడింపజేసే విధంగా పని చేయాలన్నారు.12వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలన్నారు.దేశంలో అంతర్గతభద్రత, అరాచక శక్తుల నుండి ప్రజలను రక్షించడం కోసం ఎలాంటి త్యాగాలకు వెనకాడకుండా ప్రజారక్షణే ప్రధానలక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమైన సైకిల్‌ర్యాలీ ఎన్జీ కళాశాల, ఎన్టీఆర్ విగ్రహం, శివాజీనగర్, రామగిరి, బస్టాండ్, క్లాక్‌టవర్ మీదుగా తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు నిర్వహించారు.సైకిల్‌ర్యాలీలో అదనపు ఎస్పీ నర్మద, బెటాలియన్ డీిఎస్పీ వెంకన్న, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్ఐలు స్పర్జన్‌రాజ్, నర్సింహాచారి, శ్రీనివాస్, కష్ణారావు, నర్సింహ, నాగేశ్వర్రావు, సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, చీర్ల శ్రీనివాస్, ఎస్ఐలు నర్సింహ, నరేష్, రెడ్‌క్రాస్ కార్యదర్శి గోలి అమరేందర్‌రెడ్డి, వాకర్స్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్‌గుప్త, తైక్వండో చిన్నారులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.