Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
న్యాయ సహాయం పొందే ప్రజలందరూ న్యాయ సేవా అధికార సంస్థల ద్వారా సహాయం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వేణు అన్నారు.బుధవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞాన సుందర్ అధ్యక్షతన న్యాయసలహాపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు.న్యాయ సేవా సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మానవ అక్రమ రవాణా బాధితులు, వికలాంగులు, కస్టడిలోని ఖైదీలు, విపత్తులకు గురైన వారు ఉచితన్యాయం పొందొచ్చన్నారు.వార్షిక ఆదాయం రూ.3లక్షల లోపు ఉన్న వారు అవసరమైనా ఉచిత న్యాయసహాయం పొందొచ్చన్నారు.ఆర్థిక కారణంగా ఏ వ్యక్తి గాని న్యాయం పొందే అవకాశం కోల్పోకూడదన్నారు. ఈ. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తీగల కరుణశ్రీగిరిధర్రెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్,తుంగతుర్తి బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్లు, న్యాయవాదులు రాజారామ్, సతీష్, వాలంటీర్లు జయమ్మ, లక్ష్మయ్య, నాగయ్య, రవి పాల్గొన్నారు.