Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంకిరెడ్డిగూడెంలో రూ.85 లక్షలతో అభివద్ధి పనులు
- సర్పంచ్ ముద్దం సావిత్రి
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
గ్రామాలను అభివద్ధి చేయడానికి అవసరమైన నిధులు కేటాయిస్తూ గ్రామాభివద్ధికి దివిస్ పరిశ్రమ సహకారం అందించడం అభినందనీయమని సర్పంచ్ ముద్దం సావిత్రి అన్నారు. మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామంలో దినేష్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో రూ.85,11,825లతో సీసీ రోడ్లు,బండి వాగు కల్వర్టు నిర్మాణ పనులను బుధవారం దివిస్ పరిశ్రమ డిప్యూటీ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీని అభివద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తూ దివిస్ పరిశ్రమ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. గ్రామంలో వాటర్ ఫిల్టర్, సీసీ రోడ్లు, మియావాకి నేచురల్ ఫారెస్ట్, రోడ్ల వెంట నాటిన మొక్కలకు ట్రీ గార్డ్లను అందించారని తెలిపారు. పరిశ్రమ డిప్యూటీ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం గ్రామాల అభివద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలోని గ్రామాలను అభివద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో విద్య వైద్యం అందించడానికి కషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ చైర్మన్ ఉప్పు భద్రయ్య, గ్రామ ఉపసర్పంచ్ సప్పిడి చందన, గ్రామస్తులు ముద్దం సత్తయ్య, బుచ్చిరెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, దివిస్ పరిశ్రమ ప్రతినిధులు చౌదరి, వల్లూరి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.