Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ -నల్లగొండ
కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని,అన్ని శాఖల అధికారులు కలిసి బాధ్యతగా 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వందశాతం వ్యాక్సినేషన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీడీవో, ఎంపీవో లు,పంచాయతే కార్యదర్శులు,సీడీపీఓలు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్,వైకుంఠ దామం లు నిర్మాణ ప్రగతి,నర్సరీలు ఏర్పాటు తదితర విషయాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇటీవల ఇతర దేశాలలో రష్యా,జర్మనీ, యు. కె.,చైనా దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి,అందరూ కలిసి బాధ్యతగా మండల, గ్రామ స్థాయి బందాలు వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. బందాలు ఇంటింటా సర్వే చేపట్టి మొదటి డోస్, రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎంతమంది, తీసుకొని వారు ఎంతమంది వంటి వివరాల జాబితాను రూపొందించి అందరు వ్యాక్సిన్ తీసుకునేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. నవంబర్ 3 లోగా వందశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. అన్ని గ్రామపంచాయితీ నర్సరీలలో మట్టి సేకరణ, పాలీథీన్ సంచుల కొనుగోలు,ప్రైమరీ బెడ్లు చేయుట, సీడ్ కొనుగోలు నవంబర్ 3 వ తేదీ లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కాళిందిని, జిల్లా పరిషత్ సీఈఓ వీరబ్రహ్మ చారి, డీపీఓ విష్ణు వర్ధన్,స్త్రీ,శిశు,సంక్షేమ, వద్ధుల,దివ్యంగుల శాఖ జిల్లా సంక్షేమ శాఖాధికారిని సుభద్ర,పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య పాల్గొన్నారు.