Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
- దర్వేశిపురంలో ఇంటింటికి ప్రచారం
నవతెలంగాణ -నల్లగొండ
నవంబర్ 17,18,19 తేదీల్లో జరిగే సీపీఐ(ఎం) జిల్లా 20 వ మహాసభలు 17న భారీ ప్రజా ప్రదర్శన జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 న నల్లగొండలో వేలాది మందితో ప్రజాప్రదర్శన ,బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. భారత ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని సంస్కరణలను ప్రయివేటీకరణ విధానాలను వేగవంతం చేసిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను, విద్యుత్ చట్టాలను తీసుకొచ్చి ప్రజలపై భారాలు మోపిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస,్ నిత్యావసర సరుకుల ధరలు పెంచిందన్నారు. ఎల్ఐసీ, బ్యాంకింగ్, రైల్వే, విమానయానం, రోడ్లు పోర్టులు నిట్టనిలువునా అమ్మేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో రుణమాఫీ దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉపాది,ó కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికలు రాగానే కొత్త పథకాలతో ఓట్లు వేయించుకొని అధికారంలో రావడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలతోపాటు జిల్లా సమగ్రాభివద్ధి కోసం మహాసభల్లో చర్చించి ఉద్యమాలు పోరాటాలు రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ,జిల్లా కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, మండల కార్యదర్శి కందుల సైదులు సహాయ కార్యదర్శి కాన్గు లింగస్వామి, మండల కమిటీ నాయకులు బ్రహ్మానంద రెడ్డి ,జినుకుంట్ల లింగయ్య, సోము ముత్యాలు, గట్టి గుండ్ల అంజయ్య ,సుల్తానా, మారయ్య , తదితరులు పాల్గొన్నారు.