Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 కేజీల గంజాయి పట్టివేత
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
గంజాయి తరలించేందుకు ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ వ్యక్తి పోలీసులకు పట్టుబడిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ భీమన బోయిన యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం... నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్టాండలో ఒక ప్లాస్టిక్ బస్తా మూటకట్టుకుని అటు, ఇటు అనుమానస్పదంగా తిరుగుతుండడంతో విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానిక పోలీసులు చేరుకొని అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ బస్తా మూటను పరిశీలించారు. ఎండిపోయిన ఆకులతో ఘాటు వాసన కలిగి ఉండడంతో స్థానిక పోలీసులు అతని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని బస్తాలో 22కేజీల ఎండు గంజాయి దొరికింది. హైదరాబాద్ దూల్ పేటకు చెందిన పాపాలాల్ సతీశ్ సింగ్, ఎలక్ట్రిషన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని బంధువులు గంజాయి వ్యాపారం చేస్తూ అధికంగా డబ్బులు సంపాదించడంతో అనతికాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో గంజాయి వ్యాపారాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి కోదాడ వరకు ఒక వ్యక్తి గంజాయిని సతీష్‌కు అందజేశారు. సతీష్ ఆ గంజాయి విశాఖపట్నం చెందిన వ్యక్తి వద్ద నుండి కోదాడలో తీసుకొని దుల్ పేటకు వెళ్ళుతుండగా నార్కట్ పల్లి బస్ స్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డాడు. పట్టుబడ్డ గంజాయిని స్థానిక తహసీల్దార్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ను అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.