Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ రంగనాథ్
- ఫ్లాగ్డేలో భాగంగా రక్తదాన శిబిరం
నవ తెలంగాణ -నల్లగొండ
పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డీఐజీ ఏవి.రంగనాథ్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తాను రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఫ్లాగ్ డే లో భాగంగా రక్తదానం చేసిన సిబ్బంది, యువతను అభినందించారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను సమాజం ఎప్పటికీ మరువదన్నారు. వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి తన వత్తికి వన్నె తీసుకువచ్చేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డీిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, కష్ణారావు, నర్సింహా, వన్ టౌన్ సిఐ బాలగోపాల్, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్, మహిళా పోలీస్ స్టేషన్ సీిఐ కె. అదిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ నర్సింహులు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, రెడ్ క్రాస్ కార్యదర్శి గోలి అమరేందర్ రెడ్డి, కోశాధికారి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్లు పుల్లారావు, ప్రవళిక, వెంకట్రామ్, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్త, ఏ.ఆర్., రెడ్ క్రాస్ సిబ్బంది, తైక్వండో శిక్షకులు, యువకులు పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.