Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, బూర్గు కష్ణారెడ్డి, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా మాట్లాడారు. పట్టణకేంద్రంలో డ్రయినేజీ, అంతర్గత రోడ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షం వస్తే ఊరచెరువు నిండి అలుగు రావడంతో సర్వీసు రోడ్డు వెంట ఉన్న వ్యాపార దుకాణాలు, ఇండ్లల్లోకి నీరు చేరి జలమయమవుతుందని తెలిపారు. అధికారులు, పాలకులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు ఆకుల ధర్మయ్య, గోశిక కరుణాకర్, బత్తుల దాసు, జటంగి కష్ణ, కామిశెట్టి ప్రభాకర్, ఉష్కాగుల శ్రీను, రమేశ్, చీకూరి ఈదయ్య, బాతరాజు దశరథ, ఎర్ర ఊషయ్య, నెల్లికంటి నర్సింహా, దేప రాజు, ఎమ్‌డి.ఖయ్యుమ్, కొంగరి కనకయ్య, చిలివేరు జంగయ్య, చింతకింది పాండు, భావండ్లపల్లి స్వామి, గంజి రామచంద్రం, యానాల రాజశేఖర్‌రెడ్డి, ముప్పిడి లింగస్వామి, రాజు, రాములు, శ్రీశైలం, శంకర్‌రెడ్డి, మనోజ్, ఖాసీమ్, మురళి పాల్గొన్నారు.