Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్ పోచంపల్లి
జిల్లా వ్యాప్తంగా సొసైటీ, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్ట్లీ మండల,పట్టణ కమిటీల ఆధ్వర్యంలో పట్టణంలోని సొసైటీ మార్కెట్ కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ మార్కెట్లో 25 రోజుల నుండి 278 మంది రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నెల 18 నుంచే అన్ని ఐకెపి సొసైటీ మార్కెట్ కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి నేటీకి ప్రారంభించలేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతాంగాన్ని సమీకరించి పట్టణ కేంద్రంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి కోడె బాల బాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, మంచాల మధు, మండల పట్టణ కమిటీ సభ్యులు నెలికంటి జంగయ్య, గూడూరు రాంరెడ్డి , దుబ్బాక జగన్, రైతులు దోతీ రాములు,గునంగారి అశోక్ రెడ్డి,జినకల పాపయ్య, వంగూరి వెంకటేశ్వర్లు , బాత్క కొమురయ్య, గొరిగ మనమ్మ, నల్ల యాదమ్మ, నల్ల గౌరమ్మ, భాత్క లక్ష్మమ్మ, పుట్టపాక జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.