Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మండల స్వామికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన స్నాతకోత్సవ సభలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్, ఓయూ ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ సమక్షంలో డీఆర్డీఓ చైర్మెన్ డాక్టర్ డి. సతీష్ రెడ్డి చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. నల్లగొండ జిల్లా గ్రామ నామాలు అనే అంశంపై పరిశోధన చేసినందుకుగాను మండల స్వామికి డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. స్వామిని చిట్యాల కు చెందిన ప్రముఖ సాహితీవేత్త, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, స్థానిక విశ్రాంత గెజిటెడ్ హెడ్ మాస్టర్ కుకుడాల గోవర్ధన్, కవులు సాగర్ల సత్తయ్య, పగిడి పాటి నరసింహ, పెరుమాళ్ళ ఆనంద్, తదితరులు అభినందించారు.