Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు తులాల బంగారం. 28 వేల నగదు అపహరణ.
నవ తెలంగాణ -నార్కట్‌పల్లి
పట్టపగలు చోరీ జరిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదయ్య, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న లోడంగి లక్ష్మి రోజు మాదిరిగానే ఉదయం తొమ్మిది గంటలకు ఇంటికి తాళం వేసి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఉండడంతో ఇంటికి భోజనానికి ఒంటి గంటకు చేరుకుంది. వచ్చేసరికి బయట గేటుకు వేసిన తాళం వేసినట్లే ఉంది. లోపలి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లో వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న ఇరవై రూ.28వేల నగదు, రెండు తులాల బంగారం గొలుసు చోరికి గురైనట్లు గుర్తించారు. లోపలి తలుపులకు వేసిన తాళం ని పగలగొట్టి లోపలకు చొరబడ్డాడు. చోరీ అనంతరం తలుపు దగ్గరకు వేసి తాళం తో సహా తీసుకుని గోడపై నుంచి పరారైనట్లు గుర్తించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.