Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికా యుగంధర్‌రావు
నవతెలంగాణ-తుంగతుర్తి
దేశానికి దిక్సూచి లాంటివాడు, విద్యార్థులకు మార్గదర్శకుడు ఉపాధ్యాయుడేనని సూర్యాపేట జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అన్నారు.బుధవారం మండలకేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ బోయిని లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ప్రసంగించారు.ఈ మేరకు విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రకీలకమన్నారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ అపారమైన మేధావి అని ఉపాధ్యాయుడి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయుడిని ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసు కోవాలన్నారు.వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తమఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయ మన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్, ఉమ్మడి నల్లగొండజిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్‌కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి, ఎంఈఓ బోయిని లింగయ్య,ఎంపీడీవో లక్ష్మి, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, మండల అధ్యక్షులు గౌడిచర్ల నరేష్, ప్రధానో పాధ్యాయులు గురువయ్య, భాస్కర్, పీఆర్టీయూ నాయకులు ఎర్ర హరికిషన్, డీటీఎఫ్ నాయకులు విజరుకుమార్, టీపీటీఎఫ్ నాయకులు చిత్తలూరి కర్నాకర్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు గుండ్ల ఆంజనేయులు(వెంపటి), విప్లవ్ కుమార్( కరివిరాల), మండల ఉత్తమఉపాధ్యాయులు రత్నరావు( జెడ్పీహెచ్ఎస్ వెలుగుపల్లి), గోపయ్య (జెడ్పీహెచ్ఎస్ వెంపటి) కరుణ (జెడ్పీహెచ్ఎస్ బండరామారం) సుమతి (జెడ్పీహెచ్ఎస్ తుంగతుర్తి),సత్తయ్య (ఎంపీపీఎస్ తుంగతుర్తి), పరమేష్(ఎంపీపీఎస్ కరివిరాల), జ్యోతి(ఎంపీపీఎస్ వెంపటి ),దయాకర్ (ఎంపీపీఎస్ అన్నారం), నాగరాణి (ఎంపీపీఎస్ అన్నారం), శోభారాణ ి(ఎంపీపీఎస్ తుంగతుర్తి), ఉపేందర్( ఎంపీపీఎస్ దేవునిగుట్టతండా) అనిత (ఎంపీపీఎస్ వెంపటి), రాఘవులు( ఎంపీపీఎస్ బండరామారం), ఉమామహేశ్వర్ (ఎంపీపీఎస్ గొట్టిపర్తి), భిక్షమయ్య (ఎంపీపీఎస్ నానుతండా), సీహెచ్.సోమయ్య (ఎంపీపీఎస్ తుంగతుర్తి), శ్రీలత (ఎంపీపీఎస్ తుంగతుర్తి), జి.నరేష్( ఎంపీపీఎస్ కరివిరాల), శ్రీనివాస్( ఎంపీపీఎస్ మానాపురం)లను శాలువాలు కప్పి ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు.