Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
గ్రామాలలో పట్టణాలలో పని చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ సుశ్రుత గ్రామీణ వైద్యులు శక్తికి మించిన వైద్యం చేయకూడదని గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొనుగోటి హనుమంతరావు అన్నారు.బుధవారం పట్టణంలో హైదరాబాద్ మెడిసిస్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి నిర్వహించిన మండల ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణవైద్యుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.పట్టణంలో గ్రామీణ వైద్యులు కొందరు డాక్టర్ల పేర్లు పెట్టుకుని క్లినిక్లని బోర్డులు పెట్టుకుని వైద్యం చేస్తున్నారన్నారు.అలాంటి వారు బోర్డులను తొలగించి ప్రథమచికిత్స పేరుతోనే బోర్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లో కూడా శక్తికి మించిన వైద్యం చేయొద్దన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హనుమంతరావును గ్రామీణ వైద్యులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సమావేశంలో గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డీఎస్ఎన్.చారి, శ్రీనివాసరాజు, బ్రహ్మచారి, కొండమల్లేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు జట్టమోని యాదయ్య మల్లిపెద్ది లక్ష్మీనారాయణ, వేరుకొండ రాము , వేమన్రెడ్డి, సాల్రెడ్డి, నిరంజన్, ముత్యాలు, ముత్యాలు, శ్రీనివాసచారి, శ్రీను, లక్ష్మీనారాయణ, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.