Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికప్రగతికి సాధనంగా మార్చుకోవాలి
- అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ
నవతెలంగాణ-నల్లగొండ
రుణం భారం కాకూడదని, ఆర్థిక ప్రగతికి సాధనంగా మార్చుకొని అభివద్ధి చెందాలని నల్లగొండ అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు.బుధవారం జిల్లాకేంద్రంలోని చిన్నవెంకట్ రెడ్డి ఫంక్షన్హాల్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ విస్తరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకులు కొన్ని రకాల రుణాలే ఇస్తున్నాయని ఎక్కువ మంది భావిస్తుంటారన్నారు.అయితే వివిధ రంగాలకు సంబంధించి పలు బ్యాంకులు అందించే ఎన్నో రుణాల గురించి ప్రజలందరికీ తెలిసేలా విస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.బ్యాంకులు మంజూరు చేసే పథకాలతోపాటు ఇతరాత్రా రుణాలపై అవగాహన కల్పించడం ద్వారా గ్రహీతలకు లాభం చేకూరు తుందని చెప్పారు.మహిళలు రుణాలు తీసుకుని ఆర్థిక ప్రణాళికతో కుటుంబాన్ని అభివద్ధిలోకి తీసుకెళ్లాలని కోరారు.బ్యాంకు అధికారులు, రుణ గ్రహీతలు పరస్పరం నమ్మకంతో రుణాలు అందించే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల ద్వారా సమభావన సంఘాలకు రూ.159.65 కోట్లు, ఇతర లోన్లు రూ.249 కోట్ల రుణాలను మంజూరు చేసి సంబంధిత చెక్కులను గ్రహీతలకు అందజేశారు. వివిధ బ్యాంకుల అధికారులు మాట్లాడుతూ రుణాలు వడ్డీ చెల్లించే విధానాలను వివరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కాళిందిని,ఎస్బీఐ డీజీఎం కేవీ.బంగార్రాజు, నల్లగొండ ఆర్ఎం జి.విజరుకుమార్, ఎల్డీఎం సూర్యం,ఏపీజీవీబీ ఆర్ఎం మెప్మా, ఎస్ఎల్ఎన్ ప్రసాద్, 16 బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్టాల్స్....
రుణ విస్తరణ కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి.డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులు ఉత్పత్తి చేసిన గహోపకరణాలు పిండివంటలు, చేనేత వస్త్రాలు, నారా సంచులు, వెదురు తో తయారు చేసిన గహోపకరణాల వస్తువుల స్టాళ్లను అదనపు కలెక్టర్ ప్రారంభించారు.