Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
వరి కోతలు ప్రారంభం అవుతున్న వేళ గ్రామాలలో ధాన్యం కొనుగోలుకేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం మండలకేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో నిడమనూరు, త్రిపురారం మండలాల మండల కమిటీ సమావేశం సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రమేపి రైతాంగ బాధ్యతల నుండి తప్పుకొని దళారి, దోపిడీ కార్పొరేట్ శక్తులకు ఎర్రతివాచీ పరుస్తుందని విమర్శించారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించకపోవడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని స్థితి నుంచి ధాన్యం పండిస్తే శిక్షిస్తాం, వరి వేస్తే ఉరే మీకు అని హుకూంలు జారీ చేయడం లాంటివి చూస్తుంటే భవిష్యత్‌లో రైతు అనేవాడు కను మరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పంటపై స్వేచ్ఛను కల్పిస్తూ రైతులను దోపిడి నుండి కాపాడుతూ గిట్టుబాటు కల్పిస్తూ రైతాంగానికి ప్రభుత్వం రక్షించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్‌లో కమ్యూనిస్టులు రైతాంగ ఉద్యమాలపై రైతులను సమీకరించి కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, త్రిపురారం, నిడమనూరు మండల కార్యదర్శులు దైద శ్రీను, కందుకూరి కోటేష్, సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, ఇద్దయ్య, కోదండ చరణ్‌రాజ్, ఆకారపు నరేష్, కొండేటి సామంత్, మలికంటి చంద్రశేఖర్, మెరుగు రాములు, లింగమ్మ, వెంకన్న పాల్గొన్నారు.