Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుతో పేదల భూములను బలవంతంగా గుంజుకొని ఓట్లేసిన ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.బుధవారం మిర్యాలగూడలోని ఆలగడపలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనకు బీఎస్పీ మద్దతు తెలిపింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమన్నారు.భూములు పోయే రైతుల నుంచి గ్రామసభ నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం పేదల భూములను బలవంతంగా లాక్కొంటున్న ప్రభుత్వం ఎర్రవల్లి ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ భూములు ఇండిస్టీయల్ పార్క్‌కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.బడా భూస్వాముల భూములు కేటాయించకుండా పేదల భూములను మాత్రం రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి లాక్కోవడంలో ఆంతర్యమేమిటని విమర్శించారు.భూములు కోల్పోయే రైతుల కన్నీళ్లు తుడవడానికి బీఎస్పీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. రైతులపట్ల నిరంకుషంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కోరారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు బీఎస్పీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయిన పరిశ్రమలకు భూములు ఇవ్వమని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన వెంట ఆ పార్టీ నాయకులు డా.జె.రాజు ఉన్నారు.