Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
డీవైఎఫ్ఐ మండలనూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. మండలపరిధిలోని కీతవారిగూడెం గ్రామంలోని ఆ సంఘం కార్యాల యంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బోయిళ్ళ నవీన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులుగా దోసపాటి గణేష్, కొలిపాక వంశీకష్ణను ఎన్నుకున్నారు.సహాయకార్యదర్శులుగా అజరు, ఆకులకిరణ్, సురేందర్, ఉపాధ్యాయులుగా గజ్జెల సతీష్, యాణాల రాజేష్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన మండల కార్యదర్శి కొలిపాక వంశీకష్ణ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.తన ఎన్నికకు సహరించిన ప్రతిఒక్కరికి కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన మండలకమిటీ సభ్యులు రవి, ప్రసాద్, సైదులు, బిట్టు పాల్గొన్నారు.