Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతనకల్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో అరికట్టడంలో విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు బుధవారం మండలకేంద్రంలోని తొట్ల మల్సూరు స్మారక భవనంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఏడేండ్ల కాలంలో ధరలు పెంచి సామాన్య ప్రజానీకం పైన విపరీతమైన భారాలు మోపడం సరికాదన్నారు.ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వచ్చే యాసంగి సీజన్లో వరి సేద్యం వద్దని పండించిన రైతులపై కేసులు బనాయిస్తున్నారని ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రమంతటా దళితబంధును అమలు చేయాలని కోరారు.నవంబర్ 2న పార్టీ ఏడో మండల మహాసభ మండలకేంద్రంలో నిర్వహిస్తామన్నారు.సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టియాదగిరిరావు, మండల కార్యదర్శి కందాలశంకర్రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,మండల కమిటీ సభ్యులు శ్రీను,గజ్జెల శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, వీరారెడ్డి, లింగయ్య పాల్గొన్నారు.