Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరేడుచర్ల: మండలంలోని పాఠశాలలను జిల్లా విద్యాధికారి కె.అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.నేరేడుచర్ల ఉన్నత పాఠశాల, పెంచికల్‌దిన్న ప్రాథమిక పాఠశాల,ఉన్నత పాఠశాలలను కల్లూరు, ముకుందాపురం ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్నం భోజనం, విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రధానో పాధ్యా యులను అడిగి తెలుసు కున్నారు. ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పరి శీలించి సంతప్తి వ్యక్తంచేశారు. విద్యా ర్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు.పాఠశాలలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులను పాఠశాలకు వచ్చే విధంగా ప్రేరణ కల్పించి, కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠ్యబోధన చేయాలని సూచించారు.మొదటిసారిగా మండలానికి విచ్చేసిన జిల్లా విద్యాధికారిని మండల విద్యాధికారి పానుగోతు. ఛత్రునాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్.శ్రీని వాసరావు, పెంచికల్‌దిన్న ప్రధానోపాధ్యాయులు విజయకుమారి, సిరికొండ అనిల్‌కుమార్, బి.వెంకటనర్సయ్య, సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.