Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య
నవతెలంగాణ ఆలేరుటౌన్
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండటంతో కావాలనే గొంగిడి దంపతులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి బీర్ల ఐలయ్య గురువారంఒక ప్రకటనలో తెలిపారు . ఆలేరు శాసన సభ్యులు సునీత , టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి కక్ష సాధింపు చర్యల లో భాగంగా నియోజకవర్గంలో ఉన్న ఏకైక కాంగ్రెస్ పార్టీ చల్లూరు గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డిపై గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ జిల్లా అధికారులచే సస్పెండ్ చేయించారన్నారు. గ్రామపంచాయతీ సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయమని ప్రభుత్వ నిబంధనలో స్పష్టంగా ఉన్నప్పటికీ పంచాయతీ తీర్మానం చేసినా పై అధికారుల అనుమతి లేదనే కారణంతో ఎమ్మెల్యే ఒత్తిడితో సస్పెండ్ చేయించారన్నారు. చల్లూరు గ్రామ పంచాయతీలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని, గ్రామ పంచాయతీ తీర్మానం చేసే పరికరాలను కొనుగోలు చేశారని తెలిపారు. వడ్ల కొనుగోళ్ళ లో నియోజకవర్గం లోని అన్నీ ఐకేపీ సెంటర్లలో గోల్ మాల్ జరిగిందని ,దీనికి సంబంధించి ఆధారాలు కూడా అధికారులు సెకరించిన అవకతవకలు జరిపిన పీఏ సీఎస్ చైర్మెన్లపై, సిబ్బంది పై ఎలాంటి చర్యలు సంబంధిత అధికారులు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ల పై ఎంపీటీసి, ఎంపీపీ ల పై కక్ష చర్యలు సాధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు .