Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మండలంలోని వేల్మకన్నె గ్రామంలో ప్రాథమిక పాఠశాల పరిస్థితి దాపురించింది .ఆ పాఠశాలలో 136 మంది విద్యార్థులు ఉండగా పాఠాలు చెప్పేందుకు పంతులు ఒక్కరే రెగ్యులర్ ఉపాధ్యాయులు , ఒకరు డిప్యూటేషన్ ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వేల్మకన్నె గ్రామ సర్పంచ్ చలమల వెంకట్ రెడ్డి గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెటడ్డి కి హైదరాబాద్ లోని తమ నివాసం వద్ద వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఉన్నప్పటికీ ఉపాధ్యా యులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని విద్యా శాఖ మండల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సరిపడా 6 ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకునేందుకు తరగతి గదులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అదనపు తరగతి గదుల నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని కోరారు సమయానుకూల స్పందించిన విద్య్షాశాఖ మంత్రి సమస్య పరిష్కారం కోసం కషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ దెందే అలివేలు బీరప్ప , పూర్వ విద్యార్థుల అధ్యక్షుడు రొయ్య నరసింహ , జానీ మియా తదితరులు ఉన్నారు.