Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
ఈనెల 30న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని టి ఆర్ ఎస్ నాగారం మండల పార్టీ అధ్యక్షులు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య అన్నారు. గురువారం నాగారం బంగ్లా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ విజయ గర్జన సభను విజయవంతం చేయడం కోసం తిరుమలగిరి మున్సిపాలిటీ లోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్‌రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండ గాని అంబయ్య రైతుబంధు సమితి మండల అధ్యక్షులు పానుగంటి నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి చిల్లర చంద్రమౌళి, టిఆర్ఎస్వై మండల అధ్యక్షులు ఈదుల కిరణ్ కుమార్, నాయకులు గుంతకండ్ల ముకుందరెడ్డి కూర వెంకన్న, సోమయ్య, కన్నెబోయిన మల్లేష్, యాదగిరి వెంకటేశ్వర్లు దేవరకొండ మురళి, మహేష్ , సత్తిరెడ్డి పాల్గొన్నారు.
అర్వపల్లి: ఈ నెల30న తిరుమలగిరి శుభమస్తు ఫంక్షన్ హాల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీ పి మొన్న రేణుకా యాదవ్ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు రైతుబంధు కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు . ఈ సమావేశంలో పీఏ సీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి దేవాలయ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్ మార్కెట్ డైరెక్టర్ బందెల అర్వపల్లి నాయకులు కనుక శ్రీనివాస్ బైరబోయిన పెద్దయ్య, మామిడాల రాజలింగం, బైరబోయిన వెంకన్న, దాసరి వూశయ్య కనుక నాగరాజు పాల్గొన్నారు.