Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
- మద్యం, బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాలని తీర్మానం
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ గుత్తా ఉమాదేవి అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి,ఎంపీపీ గుప్త ఉమాదేవి ఒకరినొకరు పరస్పరం విమర్శించుకున్నారు. ఈజీఎస్ పథకం కింద చేపట్టిన పల్లె ప్రకతి వనం పనులకు బిల్లులు చెల్లించడంలో జరిగిన జాప్యంపై నారాయణపురం సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ఎంపీపీ గుత్తి ఉమాదేవిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు అధికార పార్టీ వారే అయినప్పటికీ సర్పంచ్ శ్రీహరి కర్నె ప్రభాకర్, ఎంపీపీ గుత్త ఉమాదేవి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గాలకు చెందిన వారు కావడం మాటల యుద్ధానికి చోటు చేసుకుంది. పల్లె ప్రకతి వనం కింద చేపట్టిన పనులను పర్యవేక్షించడం లో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని ఏపీఓ ప్రశాంతిని స్థానిక సర్పంచ్ శ్రీహరి నిల తీస్తుండగా ఎంపీపీ ఉమాదేవి జోక్యం చేసుకున్నారు. ఎట్లాంటి అనుమతిలేకుండా చేపట్టిన పనులను ఎట్లా పర్యవేక్షిస్తారని బిల్లు ఎట్లా చెల్లిస్తారని సర్పంచ్ అని ప్రశ్నించారు. ఆసుపత్రి చైర్మెన్నుకైనా సమాచారం ఇచ్చారా అన్నారు. చైర్మెన్ అయినంత మాత్రాన బిల్లును ఆపే అధికారం ఎక్కడిది అని సర్పంచ్ ఎంపీపీ నిలదీశారు. ఎట్లాంటి సమాచారం, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా చేపట్టిన పనులకు బిల్లులు ఎట్లా చెల్లిస్తారని ఎంపీపీ సర్పంచ్‌ను ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే బిల్లు రాకుండా అడ్డుకుంటున్నారని సర్పంచ్ శ్రీహరి ఎంపీపీ ఉమా దేవి ని ఆరోపించారు. అనుమతి లేకుండా ఆసుపత్రి ప్రహరీ గోడను కూల్చి నందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సంతోషించాలి ఆని ఎంపీపీ సూచించారు. ఆస్పత్రి చైర్మెన్ అయ్యుండి ఆసుపత్రి లో జరిగే అభివద్ధి మీటింగుకు ఒక్కసారైనా స్థానిక సర్పంచ్ ఆహ్వానించారా అంటూ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకతి వనం తన సొంతానికి చేసుకున్న పని కాదు కదా ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన పనే కదా.. బిల్లులు చెల్లించకుండా ఎందుకు పనికి మాలిన సినిమాలన్నీ చూపిస్తావంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. నీవు చేసిన పనికి తీర్మానం ఉండదు అధికారులకు,ఎంపీపీకి ఇంటిమేషన్ ఉండదు ఆ పనిని ఎట్లా అంగీకరించాలని ఎంపీపీ సర్పంచ్‌ని ప్రశ్నించారు. డీఎంఅంహేచ్ఓ అనుమతి కాఫీ గ్రామ పంచాయతీ తీర్మానం లెటర్ ఏపీవో కు ఇచ్చినా ఇవ్వలేదంటే తను ఏం చేయలేను అని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ తీర్మానం కాపీ ఇచ్చి అనుమతి తీసుకుంటే తప్ప బిల్లులు చెల్లించడం కష్టమని ఎంపీపీ సమాధానం చెప్పారు. ఎంపీపీ సర్పంచు లను సమన్వయ పరచాల్సిన ఎంపీడీవో పట్టించుకోక పోవడం వల్ల సమస్య ఉత్పన్నమవు తుందని అల్లందేవిచెరువు సర్పంచ్ సురివి యాదయ్య అన్నారు. ఏపీఓ గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనులను ఎక్కడ పరిశీలించిన దాఖ లాలు లేవని సర్పంచ్ శ్రీహరి ఆరోపించారు. మండ లంలో బెల్టుషాపులను పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి, గుజ్జ పీఏసీఎస్ చైర్మెన్ దొడ యాదిరెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.