Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మాడ్గులపల్లి
ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20రోజుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రాసులుగా పోసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వడ్లను ఆరబోయడం, భద్రపరచడం కోసం తెచ్చిన పట్టాలకు కిరాయి రోజుకు రూ. 500 నుండి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం వేములపల్లి పీఎస్ కింద ఉండేది ఇప్పుడేమో తిప్పర్తి మండలానికి మార్చడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని రైతులు చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17 నుంచి ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కగింజకూడా కొన్న పాపానపోలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగడానికి మంచినీటి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వేనేపల్లి వెంకటేశ్వర్లు, మాడ్గులపల్లి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శ్రీనివాస్,వేములపల్లి మండల కార్యదర్శి పాధూరి శశిధరెడ్డి,రైతు సంగం జిల్లా అధ్యక్షులు పాల్వాయి రాంరెడ్డి,రైతుసంగం జిల్లా నాయకులు అశోక్ రెడ్డి,రైతులు మాడ్గుల యాదయ్య,సైదులు,రాజు తదితరులు పాల్గొన్నారు.