Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలో పేద కుటుంబానికి చెందిన బొల్లం వెంకటేష్ 3 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ నాడు హైదరాబాదులో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి మెదడు రక్షణగా ఉన్న రెండు చిప్పలను తొలగించి భద్రపరిచి ఆనాడు తాత్కాలిక చికిత్స చేశారు. అప్పటికే సుమారు 28 లక్షలు ఖర్చు కాగా తిరిగి చిప్పలను మెదడుకు రక్షణగా అమర్చేందుకు ప్రస్తుతం 10 లక్షలు అవసరం కావడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ప్రతి నెల మందులకు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుండడంతో విషయం తెలుసుకున్న కోదాడకు చెందిన జయవరపు పరమేశ్వరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భర్త నరేందర్, యూఎస్ఏ లో ఉంటున్న కూతురు సాయి నేహా లు స్పందించి ఒక నెలకు అయ్యే మందుల ఖర్చు 5వేల రూపాయలను గురువారం ఫౌండేషన్ సభ్యులు పోటు వెంకటేశ్వరరావు, వీరేపల్లి రామారావుల ద్వారా బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఫౌండేషన్ వారికి కతజ్ఞతలు తెలిపారు.