Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలంలోని అనంతారం గ్రామంలో జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ రేవతి పరంధాములు ఆధ్వర్యంలో సూర్యాపేట జమ్మిగడ్డకు చెందిన హేల్తీపై హాస్పిటల్ వారు చేపట్టిన ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యింది. ఈ శిబిరంలో గ్రామస్థులకు షుగర్, బిపి, ఈసిజి టెస్టులతో పాటు జ్వరం, వొంటి నొప్పుల కు చికిత్స నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకుడు మతకాల చలపతి రావు మాట్లాడుతూ సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం ఉన్న కారణంగా ప్రజల అవసరాలకు తగిన రీతిలో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో సూర్యాపేటలో హెల్త్ పై మల్టిస్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించామన్నారు. ప్రజలకు ఆరోగ్య సహాయకరంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వీలుని బట్టి భవిష్యత్తులో ఇలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దంతాల లక్ష్మీనారాయణ, మరియు డాక్టర్ అపర్ణ, సిబ్బంది, అనంతారం గ్రామ ప్రజలు, పాల్గొనడం జరిగింది.